డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. గుర్మీత్ రామ్ రహీం సింగ్ బాబాకు శిక్ష ను ఈ నెల 28వ తేదీన బాబాకు శిక్షను ఖరారు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. బాబా గతంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆయనపై ఉన్న అత్యాచారం కేసులో కీలక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పంజాబ్, హరియాణాల్లో భారీ భద్రతా ఏర్పాటు చేపట్టారు. పంచుకులలో ఆర్మీని రంగంలోకి దింపారు. 5 లక్షల మందికి పైగా అభిమానులు పంచకుల చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. బాబాను కోర్టు నుంచి నేరుగా జైలుకు తరలించనున్నారు.