వీడు చాలా డేంజర్

Update: 2018-03-22 02:28 GMT

ప్రేమ పేరుతో యువతుల్ని లొంగదీసుకుంటాడు. సీక్రేట్ గా నగ్న చిత్రాలను సెల్ ఫోన్ లో తీస్తాడు. డబ్బులివ్వకపోతే ఫేస్ బుక్ లో ఆ ఫొటోలను అప్ లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు గురి చేస్తుంటాడు. ఇలా యువతుల జీవితాలతో చెలగాటమాడే కామాంధుడ్ని హైదరాబాద్ షీ టీమ్స్ పోలీసులు పట్టుకున్నారు. అతడి పేరు అల్తాఫ్ ఖాన్.. గోల్కొండలో నివాసముండే అల్తాఫ్ ఖాన్ మాయమాటలతో యువతులను ఆకర్షిస్తాడు. ప్రేమించానని వెంటబడ్తాడు. ఇలా ఒకరిద్దరు కాదు.. ఎంతో మంది అమ్మాయిల్ని వలలో వేసుకున్నాడు అల్తాఫ్ ఖాన్. ఇతని మాయ మాటలు నమ్మి ప్రేమలో మునిగిన యువతులను శారీరకంగా లోబర్చుకుంటాడు. యువతుల నగ్న చిత్రాలను సెల్ ఫోన్ లో తీసుకుంటాడు. తరచూ అమ్మాయిలకు ఫోన్లు చేసి.. బెదిరింపులకు గురి చేస్తుంటాడు. ఇలా చాలా మంది అమ్మాయిల నుంచి లక్షల రూపాయలు గుంజాడితను. గతేడాది కూడా ఓ యువతిని ఇలా వేధింపులకు గురి చేయడంతో ఆమె హైదరాబాద్ షీ టీమ్స్ పోలీసుల్ని ఆశ్రయించింది. దాంతో అతన్ని అప్పట్లో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైల్లో చిప్పుకూడు తిన్నా ఇతనికి బుద్ది రాలేదు. జైలు నుంచి బయటికొచ్చిన అల్తాఫ్ మళ్లీ ఆ యువతికి, ఆమె తమ్ముడికి వాట్సాప్ లలో మెసేజ్ లు పెడ్తూ బెదిరిస్తున్నాడు. దాంతో బాధితురాలు మళ్లీ షీ టీమ్స్ పోలీసుల్ని ఆశ్రయించింది. టోలిచౌకి ప్రాంతంలో అమ్మాయిలను వేధిస్తుండగా.. ఇతన్ని షీ టీమ్స్ పోలీసులు పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. ప్రేమ పేరుతో నమ్మించి మోసాలకు పాల్పడే ఇలాంటి కామాంధులు ఉంటారు.. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త..

Similar News