వీడొక శాడిస్ట్.... వీడితో జాగ్రత్త

Update: 2017-10-13 02:23 GMT

మనం ఫొన్ నెంబర్లు ఎవరికి పడితే వారికి ఇస్తుంటాం.. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అడిగిన కూడా నెంబర్లు పంచుతుంటాం.. ఇటీవల కాలంలో సొషల్ మీడియాలో తమ నెంబర్లు కూడా పెట్టుకుంటారు చాల మంది. అలా ఫొన్ నెంబర్లు లను పబ్లిక్ గా పెట్టిన యువతులకు పొకిరిల నుంచి వెధింపులు వస్తుంటాయి. ఒక పొకిరీ ఎకంగా వంద మంది ఆడవారిని ఫోన్లలో వేధించాడు. చివరకు పోలీసులకు చిక్కిన వైనమిది.

మగవారయితే బండబూతులు...

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మహ్మాద్ కొద్ది పాటి చదువు చదివాడు. సొషల్ మీడియాలో మాత్రం చాల యాక్టివ్ గా వుంటాడు. ప్రధానంగా ఫోన్ నెంబర్లు కనబడితే చాలు ఫోన్ చేసి విసిగిస్తుంటాడు. ఇతని వేధింపులు పూర్తిగా డిఫరెంట్ గా వుంటాయని చెప్పవచ్చును. అది ఎలాగంటే....ఇతను తన సెల్ ఫోన్‌ నుంచి గుర్తు తెలియని నెంబర్లకు కాల్ చేస్తాడు. ఇలా చేసిన వారిలో మగవారు ఉంటే బండ బూతులు తిట్టి ఫోన్ పెట్టే స్తాడు. తిరిగి వారు ఫోన్ చేస్తారని వాళ్ల నెంబర్ ను ముందుగానే బ్లాక్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటాడు. ఇక పొతే మహిళలయితే వాళ్లు తో ముందుగా స్వీట్ గా మాట్లాడుతాడు. వాళ్లు కు వాట్స్ ప్ వుందా అని చూస్తాడు. వాట్సా ప్ గనుక ఆడవారి ఫోన్ నెంబరు లో ఉన్నట్లయితేఇక నరకం చూపుతాడు.

న్యూడ్ ఫొటోలు పంపుతూ....

ఆడవారి ఫోన్ నెంబర్లకు పెద్ద మొత్తంలో న్యూడ్ ఫొటోలు , వీడియోలను పంపిస్తాడు. ఇలా పంపించి వేధిస్తాడు. దీనికి తొడుగా ఆడవారి కి కాల్ చేసి నిత్యం బూతు మాటలు మాట్లాడుతుంటాడు. ఇలా ఇప్పటికి వంద మందిపైన మహిళలను వేధించాడు. హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ఈ విధంగా కాల్ చేసి వేధించగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంద మంది మహిళలను వేధించిన మహ్మాద్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Similar News