వీరిద్దరిరూ ఓటు వేయలేరు

Update: 2018-03-22 01:55 GMT

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో శాసనసభ్యత్వం రద్దయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లు ఈ నెల 23వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలులేదు. వీరికి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తమకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అయితే దీనికి పోలింగ్ తేదీ నాటికి ఎమ్మెల్యేలుగా ఉన్న వారికే ఓటు హక్కు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో కోమటిరెడ్డి, సంపత్ కుమార్ లు రాజ్యసభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేదు. మరోవైపు తమ సభ్యత్వాల రద్దుపై ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మాత్రం ఆ రెండు స్థానాలకు ఆరు వారాల పాటు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘానికి ఆదేశించింది.

Similar News