వైఎస్ జగన్ కు అస్వస్థత

Update: 2017-08-25 01:53 GMT

వైఎస్ జగన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారంలో 13 రోజుల పాటు ఏకబిగిన పాల్గొన్న జగన్ కొంత అస్వస్థతకు గురయ్యారు. ఆయన వర్షంలోనూ తడుస్తూ ప్రచారంలో పాల్గొన్న కారణంగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. జలుబు, జ్వరం ఉండటంతో ప్రస్తుతం ఆయన ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. సీనియర్ నేతలను మినహా ఎవరినీ కలవడం లేదు. వైద్యుల సూచనల మేరకు కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని చెప్పడంతో ఆయన లోటస్ పాండ్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏకబిగిన ప్రచారంలో పాల్గొనడం, వర్షంలో తడవడం వల్లనే జగన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Similar News