వైఎస్ జగన్ పై చర్యలు తీసుకుంటారా?

Update: 2017-08-23 04:57 GMT

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నంద్యాల సభలో ముఖ్యమంత్రిని కాల్చి చంపినా తప్పు లేదని జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సరిగా స్పందించకపోవడం వల్లే కేంద్ర సంఘానికి ఫిర్యాదు చేసినట్లు టీడీపీ నేతలు చెప్పారు. దీనిపై విచారణ జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం జగన్ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించనట్లే అని అభిప్రాయపడింది. జగన్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులని ఆదేశించింది. మరో వైపు ఈ వ్యాఖ్యలపై జగన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. ప్రజలని మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారని ఆవేశంతో అలా మాట్లాడానని చెప్పారు. తాజాగా ఈసీ ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Similar News