వ్యవసాయమే మా ప్రాధాన్యం

Update: 2018-03-08 08:07 GMT

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగంలో 25 శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. 19,070 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్ ను సోమిరెడ్డి ప్రవేశపెట్టారు. 90 శాతం రాయితీతో వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. విత్తనాల పంపిణీలో జాతీయ అవార్డులు సాధించామన్నారు. వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. వరి ఉత్పత్తిలో దేశంలో మూడో స్థానంలో ఉన్నామన్నారు. తంగడెంచలో మెగా సీడ్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు. వంద శాతం రాయితీతో సూక్ష్మ పోషకాలను అందజేస్తున్నామన్నారు. అన్ని జిల్లాలకు యాంత్రిక వ్యవసాయాన్ని విస్తరిస్తామని చెప్పారు. ఉత్తరాంధ్రలో దిగుబడులను పెంచేందుకు యాభై శాతం రాయితీతో విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

Similar News