మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళకు సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. శశికళ అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ శశికళ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు శశికళ రివ్యూ పిటిషన్ ను కొట్టివేసింది. శశికళ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జైలులో కూడా సకల సౌకర్యాలు పొందడానికి రెండు కోట్ల లంచాలను జైలు అధికారులకు ఇచ్చారని ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శశికళకు సుప్రీంకోర్టు మరో షాక్ ఇచ్చింది.