నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పోలింగ్ ప్రారంభమైన వెంటనే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ బూత్ నెంబర్ 81 లో శిల్పా తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైంది. అయితే ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరడం కన్పించింది. ఈసారి అధిక శాతం ఓట్లు పోలవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో 72.06 శాతం ఓట్లు నంద్యాలలో పోలయ్యాయి. ఈసారి దానిని మించిపోతుందంటున్నారు. పోలీసులు విస్తృత స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.