సెల్ఫీ లో మరణ వాంగ్మూలం

Update: 2017-10-12 02:16 GMT

వడ్డీవ్యాపారుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య, చేసుకున్నాడు. మెడకు ఉరితాడు బిగించుకుని సెల్ఫీలో మరణ వాంగ్మూలం రికార్డు చేసిన యువకుడు తన మరణానికి కారణాలను తెలిపాడు. తన దుకాణంంలోనే ఈ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. వడ్డీ వ్యాపారులు వేధింపులు వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సెల్ఫీలో పేర్కొన్నాడు. పాతబస్తీలోని జుమ్మేరాత్ బజార్లో వ్యాపారం చేసుకునే సాహీద్ ఐదుగురు వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి 5 లక్షల మేరకు అప్పు తీసుకున్నాడు . గత కొన్ని నెలల నుంచి తీసుకొన్న అప్పుకు వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. ఇటీవల కాలంలో వ్యాపారం డల్ గా ఉండడంతో వడ్డీ చెల్లించలేక పోయాడు . జుమ్మేరాత్ బజార్లో ఒక చిన్నపాటి ఫర్నిచర్ దుకాణం నడిపేవాడు. తాను తీసుకున్న అప్పుతో షాపును కొంతీవరకూ అభివృద్ధి చేశాడు. మరొకవైపు తన కుటుంబ పోషణ మొత్తం కూడా ఈ దుకాణం పైనే ఆధారపడి ఉండేది. దీంతో అయిదుగురు ప్రవేటు ఫైనాన్సియర్లు ఎప్పటికప్పుడు వడ్డీ కోసం ఇబ్బందులు పెట్టారు . తీసుకొన్న అప్పుకు పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లించాడు సాహిబ్ అయినప్పటికీ వ్యాపారులు మాత్రం వడ్డీ కోసం నానా తిప్పలు పెట్టారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక అర్థరాత్రి సమయంలో తన షాపులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోయే ముందు తన సెల్ ఫోన్లో ఒక వీడియో రికార్డు చేశాడు. తన చావుకు ఐదుగురు వడ్డీ వ్యాపారులు కారణమంటూ వీడియోలో చెప్పాడు. దీంతోపాటుగా లేఖ కూడా రాశాడు. వీడియో రికార్డు, సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ మేరకు పోలీసులు ఐదుగురు వడ్డీ వ్యాపారులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు..

Similar News