హైదరాబాద్ లో సెల్ఫీ సూసైడ్

Update: 2018-03-20 04:07 GMT

సెల్ఫీ సూసైడ్ లు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. చనిపోవాలనుకునేవారు తామెందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నామో ఫోన్ లో వీడియో రికార్డు చేస్తున్నారు. హైదరాబాద్ లోని షాహినాయత్ గంజ్ లో సెల్ఫీ సూసైడ్ కు పాల్పడ్డాడు ఓ యువకుడు. తనకు బతకాలని లేదని, చచ్చిపోతున్నానని, తన డెడ్ బాడీని పోస్టుమార్టం చేయుద్దని, రాజస్థాన్ లోని తన ఊరికి పంపించాలని, తనేమైనా తప్పు చేసి ఉంటే క్షమించమని అక్కా చెల్లెళ్లను వేడుకున్నాడు. రాజస్థాన్ రాష్ట్రం బార్మార్ జిల్లా నోసర్ గ్రామానికి చెందిన జశ్వంత్ సింగ్ ఏడాదిన్నర కాలం నుంచి గోషామహాల్ లోని ఎక్స్ లెంట్ క్రియేషన్స్ లో పనిచేస్తున్నాడు. ఒంటరిగా గోషామహాల్ లోనే ఉండే ఇతను మానసికంగా కుంగిపోయి.. జీవితంపై విరక్తి చెందాడు. చనిపోయే ముందు ఫోన్ లో సెల్ఫీ సూసైడ్ వీడియో రికార్డు చేశాడు. ప్రేమలో వైఫల్యమే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు. సోదరుడు జశ్వంత్ ఎంతకీ ఫోన్ రిసీవ్ చేసుకోకపోయేసరికి.. ఇంటికి చేరుకున్నాడు షేర్ సింగ్.. డోర్ బాదినా తెరవలేదు. దీంతో అనుమానించి ఇంటి యజమానికి విషయం చెప్పడంతో తలుపులు పగులగొట్టి చూడగా.. లోపల ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు జశ్వంత్ సింగ్.. జశ్వంత్ సింగ్ ను చికిత్స కోసం నాంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు నిర్థారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని.. జశ్వంత్ సింగ్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి పోస్టుమార్టం కోసం తరలించారు.

Similar News