లేటెస్ట్ టాప్ 10 తెలుగు న్యూస్ 3-9-2023
ఇవాళ్టి లేటెస్ట్ టాప్ 10 తెలుగు న్యూస్
తెలంగాణలో లిక్కర్ స్వైర విహారం! ఖజానా గల గల
తెలంగాణ లో ప్రభుత్వానికి వచ్చే అతి ముఖ్య ఆదాయాలలో జిఎస్టి,సేల్స్ టాక్స్ తరువాత మద్యంపై పన్ను ఆదాయమే అతి కీలకమైనది.2014 లో మద్యంపై పన్ను ఆదాయం సుమారు 2500 కోట్లు ఉంటే, 2022-2023 సంవత్సరానికి ఇది 20,000 కోట్లకు చేరింది.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాచుపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు
ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు,కమీషనర్ రామకృష్ణ రావు గారు,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారు, గౌరవ ప్రజాప్రతినిధులతో 1వ డివిజన్ పరిధిలో ప్రగతి యాత్ర లో భాగంగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి సుబ్బారావు గారితో,సీనియర్ నాయకులు సుబ్బారావు గారితో,స్థానిక డివిజన్ వాసులతో కలిసి పాద యాత్ర నిర్వహించడం జరిగింది.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8న ప్రధాని మోడీ- బైడెన్ సమావేశం కీలక ఒప్పందాలు..
ఢిల్లీలో సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరగనున్న జి 20 సదస్సుకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకున్నారు.అయితే ఈ సదస్సు జరగబోయే రెండురోజుల ముందే జో బైడెన్ భారత్‌కి చేరుకోనున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఏ ఆప్షన్‌కైనా చంద్రబాబు సిద్ధం..!
ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికలకు తొమ్మిది నెలలు టైమున్నా రాజకీయం మాత్రం రంజుగా సాగుతోంది. అధికార వైకాపా ఎన్నికల హామీలన్నీ దాదాపు నెరవేర్చి, అదే ఆత్మవిశ్వాసంతో సమరానికి సిద్ధమవుతోంది. తెలుగుదేశం అధ్యక్షుడు అడపా దడపా ఆంద్ర ప్రదేశ్‌లో ప్రయాణిస్తూ క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
భారీ స్కోరు చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న టీమిండియా
పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ ముగిసింది. 48.5 ఓవర్లలో 266 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది. పాకిస్థాన్‌కు 267 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. మొదట తడబడిన భారత జట్టు.. ఇషాన్ కిషన్(82), హార్ధిక్ పాండ్యా(87) రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు దక్కించుకుంది.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సోనియాగాంధీకి స్వల్ప అస్వస్థత... ఆసుపత్రిలో చేరిక
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. తేలికపాటి జ్వరం,ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిని ఆమెను ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విశ్వక్‌సేన్‌ను సర్‌ప్రైజ్ చేసిన బాలయ్య..
విశ్వక్ సేన్ (Vishwak Sen), బాలకృష్ణ (Balakrishna) అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్న దగ్గర నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకరి ఫంక్షన్స్ కి ఒకరు అటెండ్ అవుతూ సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా బాలయ్య, విశ్వక్ కి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడట.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దీప్తిని చంపేసిన చందన.. ఒప్పేసుకుంది
జగిత్యాల జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి కేసును పోలీసులు ఛేదించారు. దీప్తి సోదరి చందన ఆమె ప్రియుడు ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. దీప్తి సోదరి చందనతో పాటు ఆమె ప్రియుడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పాలేర్ టికెట్ బెంగళూరులో డిక్లేర్ అవుతుందా?
2016 బై ఎలక్షన్‌లో 45 వేల ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు తిరిగి అదే వేవ్‌లో గెలుస్తాను అనుకుంటున్నారు తుమ్మల నాగేశ్వర్ రావ్.. ఖమ్మంలో తాను ప్రజా ప్రతినిధి.. అందరివాడిని.. అందుకే నన్నే గెలిపిస్తారనే ధీమాతో ఉన్నారు పొంగులేటి శ్రీనివాస్.. రాజన్న రాజ్యం తెస్తాను.. తన తండ్రి ఆశయాలను తిరిగి నెలకొల్పుతాను..
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
లోక్ సభతో పాటుగా ఏపీ ఎన్నికలు ?
అసెంబ్లీలు, లోక్‌సభకు కలిపి 2023 డిసెంబరు నుంచి వచ్చే డిసెంబరు మధ్యలో ఎన్నికలు జరగాల్సిన 10 నుంచి 12 రాష్ట్రాల పాక్షిక జమిలి ఎన్నికలు జరిపే విధంగా కేంద్రం పావులు కదుపుతున్నట్లు సమాచారం.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి