బాలిక కిడ్నాప్‌ కోసం దుండగుడి ప్రయత్నం.. కుక్క ఎలా కాపాడిందో చూస్తే షాకవుతారు.. వీడియో వైరల్‌

కుక్క విశ్వాసం గల జంతువు అంటారు. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.. స్వరం లేని ఈ జంతువు తన యజమానికి ఆపదలో ఉందని తెలిస్తే,;

Update: 2024-03-07 11:30 GMT

Viral Video

కుక్క విశ్వాసం గల జంతువు అంటారు. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.. స్వరం లేని ఈ జంతువు తన యజమానికి ఆపదలో ఉందని తెలిస్తే, అతడిని రక్షించేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. కుక్క విధేయతకు సంబంధించిన అనేక ఆశ్చర్యకరమైన కథలను మీరు విని ఉంటారు. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విషయం విన్న తర్వాత మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లోకి కుక్కను పెంచుకోవాలని ఆలోచిస్తుంటారు. ఈ రోజుల్లో, ఒక పెంపుడు కుక్క తన మెదడును మనిషిలా ఉపయోగించి కిడ్నాప్ నుండి ఒక అమ్మాయిని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కుక్క, చనిపోయినట్లు నటిస్తూ, ఆ బాలిక ప్రాణాలను కాపాడడమే కాకుండా, తాము పెంపుడు జంతువులే కాదు, తమ ప్రియమైనవారి భద్రత కోసం ఎంతకైనా వెళ్ళగల నమ్మకమైన సహచరులని కూడా నిరూపించింది. వైరల్ అవుతున్న వీడియోలో, అమ్మాయి కుక్కతో ఆడుకోవడం మీరు చూడవచ్చు. అయితే అకస్మాత్తుగా ఓ దుండగుడు తుపాకీ పట్టుకుని ఇంట్లోకి ప్రవేశించడంతో క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. పాపాను ఎత్తుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో వెంటనే ఆ కుక్క అతనిపై దాడి చేసి పాపను కాపాడింది.

దుండగుడిని మోసం చేసేందుకు కుక్క చనిపోయినట్లు నటించడం వీడియోలో చూడవచ్చు. కానీ ఆ దుర్మార్గుడు ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ప్రయత్నించగానే కుక్క వెంటనే లేచి తన చేతిని దవడల్లో పట్టుకుంది. సోషల్‌ మీడియాలో ఈ కుక్క తెలివితేటలను చూసిన నెటిజన్లు తెగ కొనియాడుతున్నారు.

Tags:    

Similar News