ఎర్రచందనం మొక్కలు పంపిణీకి సిద్ధం

హరిత హారంలో భాగంగా తెలంగాణ అటవీ శాఖఇళ్లల్లో పెంచుకునేందుకు ఎర్రచందనం మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించింది

Update: 2022-01-12 03:34 GMT

హరిత హారంలో భాగంగా తెలంగాణ అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లల్లో పెంచుకునేందుకు ఎర్రచందనం మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. వచ్చే జూన్ నుంచి తెలంగాణలో హరిత హారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ఆసక్తి ఉన్నవారికి ఎర్రచందనం మొక్కలను పంపిణీ చేయాలని తెలంగాణ అటవీ శాఖ నిర్ణయించింది. ఆసక్తి ఉన్న వారు ఎవరైనా తమను సంప్రదించవచ్చని అటవీ శాఖ కోరింది.

ఇళ్లల్లో పెంచుకునేందుకు....
ఎర్రచందనం మొక్కల పెంపంకంపై అటవీ శాఖ ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయిచింది. ఇప్పటికే ఇళ్లల్లో పూల, పండ్ల మొక్కలను పంపిణీ చేసిన అటవీ శాఖ ఈసారి ఎర్రచందనం మొక్కలను పంపిణీ చేయడానికి సిద్ధమయింది. జిల్లా కేంద్రాల్లోని నర్సరీల్లో వీటిని ఇప్పటికే పెంచుతున్నారు.


Tags:    

Similar News