వరి విత్తనాలు చల్లేందుకు డ్రోన్ల వినియోగం

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూ రైతులకు సులభ పద్ధతిలో సాగులో మెళుకువలను నేర్పుతుంది

Update: 2022-01-05 12:34 GMT

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూ రైతులకు సులభ పద్ధతిలో సాగులో మెళుకువలను నేర్పుతుంది. తాజాగా వరి విత్తనాలను చల్లేందుకు డ్రోన్ల ను వినియోగించవచ్చని, తద్వారా సాగు ఖర్చును తగ్గించుకోవచ్చని సూచిస్తుంది. వరి విత్తనాలను నాటేందుకు కూలీల అవసరం లేకుండా డ్రోన్లను వినియోగించ వచ్చని పేర్కొంది. దీనివల్ల ఎకరానికి ఆరేడు వేలు మిగిల్చుకోవచ్చని యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఖర్చులు తగ్గుతాయి...
దీనివల్ల రైతులకు సాగు ఖర్చు తగ్గడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. వరి సాగులో నేరుగా విత్తనాలను చల్లే పరిస్థితిని అనేక మంది అనుసరిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది. కూలీలు చేసినట్లే డ్రోన్ల సాయంతో విత్తనాలను చల్లవచ్చని చెబుతున్నారు. క్రమపద్ధతిలో మొలకలు వస్తాయని తమ పరిశోధనలో తేలిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లితే తర్వాత ఎరువులు, పురుగుమందులు, వరికోత వంటివి కూడా యంత్రాల సాయంతో చేయవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


Tags:    

Similar News