ఎనుమాముల మార్కెట్ వద్ద ఉద్రిక్తత
వరంగల్ ఎనుమాముల మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు మార్కెట్ యార్డు వద్ద ధర్నాకు దిగారు
వరంగల్ ఎనుమాముల మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు మార్కెట్ యార్డు వద్ద ధర్నాకు దిగారు. వ్యవసాయ కార్యాలయాన్ని రైతులు ముట్టడించడంతో ఎనుమాముల మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సీజన్ లో మిర్చి దిగుబడి సరిగా లేదని, తెగులు సోకడం, అకాల వర్షంతో పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గిట్టుబాటు ధర....
క్వింటాల్ మిర్చి 17,200 బయట మార్కెట్ లో ధర పలుకుతుంటే ఇక్కడ తొమ్మిది వేల నుంచి పదమూడు వేలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పెద్దయెత్తున రైతులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాము శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.