వైఎస్సార్ పింఛన్ల పంపిణీ ఈరోజు తెల్లవారు జామున ప్రారంభమయింది. ఒకటో తేదీ కావడంతో పింఛను దారులకు ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం నుంచి ఫించన్లను ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయనుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఒకటో తేదీన పింఛను అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం నుంచి వాలంటీర్లు పింఛన్లను పంపీణీ చేయడం ప్రారంభించారు.
ఇప్పటి వరకూ....
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 60.75 లక్షల మంది పింఛనుదారులకు పంపిణీ చేస్తారు. ఇందుకోసం ఆర్థిక శాఖ 1,543.80 కోట్ల నిధులను విడుదల చేసింది. ఉదయం 7 గంటల వరకూ 30.01 శతం పింఛన్లను పంపిణీ చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. 7 గంటల వరూ 18.22 లక్షల మందికి 461.92 కోట్ల రూపాయలను అందచేసినట్లు ఆయన తెలిపారు.