ముందస్తు బెయిల్ పిటీషన్ వాయిదా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‍పై విచారణ వాయిదా పడింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‍పై విచారణ వాయిదా పడింది. చిత్తూరు జిల్లా అంగళ్లు కేసులో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్ పై విచారించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ నెల 20వ తేదీకి విచారణను వాయిదా వేసింది.
ఈ నెల 20న,
చంద్రబాబు తన చిత్తూరు జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టారని, ఈ ఘటనలో అనేక మంది పోలీసులు గాయపడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అంగళ్లు కేసులో చంద్రబాబు ఎ1 నిందితుడిగా ఉన్నారు. అయితే తనను ఈ కేసులో అరెస్ట్ చేస్తారని భావించి ముందస్తు బెయిల్ పిటీషన్ ను చంద్రబాబు తరుపున న్యాయవాదులు వేశారు. విచారణ ఈ నెల 20వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అయితే చంద్రబాబు, ప్రభుత్వ తరుపున న్యాయవాదులు పిటీషన్ ను వాయిదా వేయాలని కోరడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.