నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి;

Update: 2022-07-06 03:21 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేట ినుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న పరీక్షల్లో 2,07,160 మంది విద్యార్థులకు హాజరు కానున్నారు. బెటర్‌మెంట్ పరీక్షలను కూడా ప్రభుత్వం నేటి నుంచి నిర్వహిస్తుంది. బెటర్‌మెంట్ కోసం 8,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటి కోసం విద్యాశాఖ అధికారులు 986 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి.

విమర్శలతో..
ఇటీవల విడుదలయిన టెన్త్ పరీక్ష ఫలితాల్లో 65 శాతం మంది ఉత్తీర్ణత రావడంతో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం కావాలనే అమ్మవొడి పథకాన్ని ఆపేందుకు ఫలితాల శాతాన్ని తగ్గించిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. దీంతో ప్రభుత్వం సప్లిమెంటరీ, బెటర్ మెంట్ పరీక్షలను నిర్వహించనుంది.


Tags:    

Similar News