నేడు కేంద్ర బృందం రాక

ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది;

Update: 2021-11-26 01:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. మూడు రోజుల పాటు నాలుగు జిల్లాల్లో పర్యటించనుంది. వరదల వల్ల దెబ్బతిన్న ఆస్తి నష్టంతో పాటు పంట నష్టం కూడా ఈ కేంద్ర బృందం అంచనా వేయనుంది. ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం అధికారుల బృందాన్ని పంట నష్టాన్ని అంచనా వేయడానికి పంపింది.

నాలుగు జిల్లాల్లో....
ఈరోజు కేంద్ర బృందం చిత్తూరు జిల్లాలో పర్యటించనుంది. ఈ నెల 13 నుంచ 20వ తేదీ వరకూ కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదల వల్ల ఎక్కువగా చిత్తూరు, కడప జిల్లాలు నష్టపోయాయి. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ఏపీలో రెండు బృందాలుగా విడిపోయి మూడు రోజుల పాటు పర్యటించనుంది.


Tags:    

Similar News