ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో రగడ
కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో వైసీపీ సభ్యులు మధ్య ఘర్షణ జరిగింది.
కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో వైసీపీ సభ్యులు మధ్య ఘర్షణ జరిగింది. సమావేశం ప్రారంభమయిన వెంటనే తమ వార్డుల్లో పనులు జరగడం లేదని కొందరు వైసీపీ సభ్యులు ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వైసీపీకి చెందిన మరో వర్గం దీనికి అభ్యంతరం తెలిపింది. పనులు ఎక్కడ జరగడం లేదో చూపించాలని మరో వర్గం సవాల్ విసిరింది. వాగ్వాదం కాస్తా ఘర్షణ కు దారితీసింది.
వైసీపీ కౌన్సిలర్లు...
దీంతో ఒకరితో ఒకరు చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కౌన్సిల్ హాలులోకి వచ్చి రెండు వర్గాలను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. తన వార్డులో పనులు జరగడం లేదని 13వ వార్డు కౌన్సిలర్ ఇవర్ఫాన్ భాషా సమస్యను లేవనెత్తగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఖాజామొహిద్దీన్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సమావేశం హాలు నుంచి బయటకు వచ్చి కూడా ఒకరిపై ఒకరు దాడికి దిగడం విశేషం.