వైభవంగా ప్రారంభమైన ‘మానుస్’
మానుస్’ కార్యక్రమం లయోలా కాలేజ్ ఓల్డ్ సెమినార్ హాల్ లో వైభవంగా ప్రారంభమైంది. వ్యాపారవేత్తలు కావాలనుకునే వారి కోసం దీనిని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు నిన్న (ఆగస్టు 31న) ఫ్లాష్ మోబ్ ను నిర్వహించారు.
వైభవంగా ప్రారంభమైన ‘మానుస్’
‘మానుస్’ కార్యక్రమం లయోలా కాలేజ్ ఓల్డ్ సెమినార్ హాల్ లో వైభవంగా ప్రారంభమైంది. వ్యాపారవేత్తలు కావాలనుకునే వారి కోసం దీనిని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్దులలోకి తీసుకువెళ్లేందుకు నిన్న (ఆగస్టు 31న) ఫ్లాష్ మోబ్ ను నిర్వహించారు.
జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఎస్ జే కరస్పాండెంట్ రెవ. ఫాదర్. డాక్టర్ సగయ్ రాజ్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ ఎస్ జె డీన్ రెవ. ఫా. డాక్టర్ మెల్కోయిర్ అండర్ గ్రాడ్యుయేట్ ఎస్ జే వైస్ ప్రిన్సిపాల్ రెవ. ఫా. ఎస్ కిరణ్ కుమార్, ఈవెంట్ కో -ఆర్డినేటర్ జి. శ్రవణ్ కుమార్, స్టుడెంట్ కో ఆర్డినేటర్ మహ్మద్ సొహైల్, బిబిఏ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ శ్రీమతి డి. ఉమాదేవి పాల్గొన్నారు. ఈ వినూత్న కార్యక్రమానికి మేనేజ్మెంట్ విద్యార్థులు, డిగ్రీ, పీజీ కాలేజీల నుంచి బీబీఏ, బీకాం, ఎంబీఏ విద్యార్థులు 25 కాలేజీల నుంచి 500 మంది పైగా పాల్గొన్నారు. వారంతా ఫార్మల్, ఇన్ ఫార్మల్ ఈవెంట్స్ లో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు.ఫార్మల్ ఈవెంట్స్ లో బిజినెస్ క్విజ్, హ్యూమన్ రీసోర్స (మానవ వనరులు) ఫైనాన్స్, యంగ్ మేనేజర్, ప్రోడక్ట్ లాంచ్, బ్రాండ్ హంట్ వంటివి ఉండగా, ఇన్ఫార్మల్ ఈవెంట్స్ లో మిస్టర్ అండ్ మిస్ మానుస్, డాన్స్ , క్విక్ బీ, స్పాట్ ఫొటోగ్రఫీ పోటీలు ఉన్నాయి, ఈవెంట్ రేపు కూడా కొనసాగబోతుంది అని ఈవెంట్ కో-ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్ తెలుగుపోస్టు కి తెలిపారు.
‘మానుస్’ లిటరరీ, కల్చరల్ మీట్ కార్యక్రమానికి మెకానిక్స్ (Mechanix ) టైటిల్ స్పాన్సర్ చేయగా, రాజ్ దర్భార్ ఫ్యామిలీ రెస్టారెంట్ , హరివిల్లు సంస్థలు కో స్పాన్సర్లు గా ఉన్నాయి. ఎన్ జే గాడ్జెట్స్, షైనీ డెంటల్ క్లినిక్, బోబ హాలిక్, గాడ్జెట్ షాక్, ఆంధ్ర హాస్పిటల్స్ , రెడ్ ఓవెన్ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.
అఫీషియల్ (అధికారిక) మీడియా పార్టనర్లగా, స్కైలైన్ ఫొటోగ్రఫీ, డిజిటల్ మీడియా పార్టనర్ గా తెలుగు.పోస్ట్, రేడియో పార్టనర్ గా రెడ్ ఎఫ్ (93.5 ఎఫ్ ఎం) సహకారం అందిస్తున్నారు. ‘మానుస్ ’ కార్యక్రమాన్ని వస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ,ఈ మీట్ రెండవ రోజుని కూడా సక్సెస్ చేయవలసిందిగా ఈవెంట్ కో- ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్ కోరుతున్నారు.