కడప జిల్లాలో చిరుత మృతి
కడప జిల్లాలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక చిరుత పులి మృతి చెందింది.;
కడప జిల్లాలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక చిరుత పులి మృతి చెందింది. రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టడం వల్లనే పులి మృతి చెందింది. కడప జిల్లా గువ్వల చెరువు ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. చిరుత పులి మంచినీరును తాగేందుకు పక్కనే ఉన్న చెరువుకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
వాహనం ఢీకొని....
చిరుతపులి మృతి వార్త తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. ఈ ప్రాంతంలో చిరుత సంచారం వార్త విని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.