ఇకపై ఆ అధికారం పట్టణాభివృద్ధి సంస్థ నుంచి మున్సిపాలిటీ లకు బదిలీ...!!!

భవన నిర్మాణాలు మరియు లే అవుట్ లకు సంబంధించిన అనుమతులు సులభతరం చేస్తూ...;

Update: 2025-01-12 10:58 GMT

భవన నిర్మాణాలు మరియు లే అవుట్ లకు సంబంధించిన అనుమతులు సులభతరం చేస్తూ... ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....!!

ఏపీ బిల్డింగ్ రూల్స్-2017, ఏపీ ల్యాండ్ డెవలప్ మెంట్ రూల్స్- 2017లో సవరణలు చేసింది.గతంలో భవన నిర్మాణం,లే అవుట్ లకు పట్టణాభివృద్ధి సంస్థ అనుమతులు ఇస్తుండగా.., ఇప్పుడు ఆ అధికారాలను మున్సిపాలిటీలు, కార్పోరేషన్ లు,నగర,గ్రామ పంచాయతీ లకు బదిలీ చేసింది..!!!

ప్రజల సౌలభ్యం కోసం ఈ నిబంధనలు స్వీకరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది..!! ఇకపై భవనాలకు పలు రకాల అనుమతులను మున్సిపాలిటీలు,కార్పొరేషన్లు అనుమతించనున్నాయి.

"" నగర పంచాయతీల్లో అయితే మూడెకరాలు దాటితే డీటీసీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

గ్రామ పంచాయతీలు 300 చ.మీ,10 మీటర్ల ఎత్తు వరకూ అధికారులు అనుమతులు మంజూరు చేస్తారు.

అనధికారిక కట్టడాలపై మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీలు చర్యలు తీసుకునేలా అధికారాలు బదలాయింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.""

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో కూటమి ప్రభుత్వం మార్పులు తీసుకుంది.

Tags:    

Similar News