నేడు దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం
నేడు దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనుంది.
నేడు దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనుంది. కేరళలోని తిరువనంతపురంలో జరిగే ఆ సమావేశానికి కేంద్రహోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లు ఈ సమావేశాలకు హాజరు కావడం లేదు. జగన్ కడప జిల్లా పర్యటనలో ఉండటంతో ఆయన స్థానంలో మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఈ సమావేశానికి వెళుతున్నారు. అలాగే తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ ఆలీ హాజరు కానున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలు....
విభజన సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సమవేశంలో డిమాండ్ చేయనున్నారు. ప్రధానంగా 19 అంశాలపై చర్చ జరపాలని ఏపీ డిమాండ్ చేయనుంది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయీలతో పాటుగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నారు. తెలంగాణ కూడా తమకు ఏపీ నుంచి 12000 కోట్లు విద్యుత్తు బకాయీలు రావాలని కోరనుంది. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్థిక శాఖ అధికారులు హాజరు కానున్నారు.