Cyclone : ఏపీకి మరో తుఫాను ముప్పు
బంగాళాఖాతం లో డిశంబర్ 16 వ తేదీన ఒక ఉపరితల అవర్తనం ఏర్పడనుంది. ఇది తుఫానుగా మారనుంది
బంగాళాఖాతం లో డిశంబర్ 16 వ తేదీన ఒక ఉపరితల అవర్తనం ఏర్పడనుంది. డిశంబర్ 18 కి అది అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం శ్రీలంక-తమిళనాడు -ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం భారీ తుఫాన్ గా ఏర్పడు తుందని కూడా హెచ్చరిస్తున్నారు.
ఐదు రోజుల పాటు...
ఆంధ్రప్రదేశ్ వైపు గా తుఫాను వచ్చేందుకు యాభై శాతం అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు గా వస్తే డిశంబర్ 21,22,23,24,25 వరకు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కోస్తాంధ్రలో ఈ తుఫాను వల్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెబుతుండటంతో రైతులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇటీవలే మిచౌల్ తుఫాన్ దెబ్బకు అతలాకుతలమైన రైతులు మరో తుఫాను పొంచి ఉందన్న కారణంతో భయపడిపోతున్నారు. తమ పంటలను రక్షించుకోవడమెలా? అన్న దానిపై మదనపడుతున్నారు.