ఇంట్లో ఉంటే చచ్చిపోతామని.. అక్కడకు వెళితే?
ఒకే కుటుంబంలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందిన సంఘటన కడప జిల్లాలో జరిగింది.
ఇంట్లో ఉంటే వరద నీరు వస్తుందని భావించి ఆలయంపై తలదాచుకోవాలని వెళితే అక్కడ మృత్యువు వెంటాడింది. ఒకే కుటుంబంలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని మందపల్లిలో రామ్మూర్తి కుటుంబం ఉంటుంది. మొత్తం ముగ్గురు కొడుకులు, కోడళ్లు, మనవరాళ్లతో ఆ కుటుంబం నివసిస్తుంది.
ఒక్కసారిగా వరద....
అయితే ఒక్కసారిగా గ్రామంలోకి వరద రావడంతో కుమారులు, కోడళ్లు కలసి ఆలయం లోకి వెళ్లి తలదాచుకుందామని భావించారు. కానీ వరద ఆలయాన్ని చుట్టుముట్టింది. ఇంట్లో ఉన్న వాళ్లు బతికిపోయారు. అక్కడకు వెళ్లిన వాళ్లు మృతి చెందారని ఆ కుటుంబం బోరున విలపిస్తుంది. ఇంట్లో ఉన్నా బతికేవారని వారు రోదిస్తున్నారు.