ఠారెత్తిస్తున్న టెన్త్ రిజల్ట్.. ట్వీట్ల యుద్ధం
టెన్త్ పరీక్ష ఫలితాలపై టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం మొదలయింది. ట్విటర్ వేదికగా ఒకరిపై ఒకరు నిందించుకుంటున్నారు;
టెన్త్ పరీక్ష ఫలితాలపై టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం మొదలయింది. ట్విటర్ వేదికగా ఒకరిపై ఒకరు నిందించుకుంటున్నారు. ఏపీలో నిన్న టెన్త్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 62.76 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 6.26 లక్షల మంది పరీక్షలు రాస్తే 4.14 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. టెన్త్ ఫలితాలపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. "కలెక్టర్లకు టార్గెట్లు పెట్టి పిల్లలు ఫెయిలయితే చర్యలు తీసుకుంటామని బెదిరిెంచిందెవరు? కిందిస్థాయి నుంచి పై వరకూ పర్సంటేజీని పెంచడానికి ఏం చేశారో తెలియదా? మీ అండదండలున్న కార్పొరేట్ సంస్థలలో చదివే పిల్లలు ఆలిండియా ర్యాంకర్లాయె. ఇప్పుడా ర్యాంకులు తగ్గయాయని ఏడుపా బాబు" అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
అయ్యన్న కౌంటర్ ఇదే....
దీనికి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ లోనే స్పందించారు. "టెన్త్ క్లాసు పేపర్లు కొట్టసి స్టేషన్ లో తన్నులు తిన్నా పాస్ కాని నత్తి పకోడి రెడ్డి రెండు లక్షల మంది విద్యార్థులను ఫెయిల్ చేసి మూడు వేల కోట్ల అమ్మఒడి డబ్బును మిగుల్చుకోవాలని కన్నింగ్ ప్లానింగ్ వేశాడు. పనికిమాలినోడికి పదవి ఇచ్చినందుకు రిజల్ట్ రివర్స్ అయ్యాయి. విద్యావ్యవస్థ నాశనం అయింది" అని అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.