వికటించిన మధ్యాహ్న భోజనం... హెడ్ మాస్టర్ సస్పెన్షన్
మధ్యాహ్న భోజనం తిని దాదాపు 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అనంతపురం రూరల్ మండలంలో జరిగింది
మధ్యాహ్న భోజనం తిని దాదాపు 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అనంతపురం రూరల్ మండలంలో జరిగింది. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్ల కాలనీ పంచాయతీలోని ఎంపీయూపీ ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్న భోజనం విద్యార్థులు తిన్నారు. సాంబారు, అన్నం, పప్పు తిన్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. అయితే ఆహారం తిన్న వెంటనే 36 మంది విద్యార్థులకు కడుపు నొప్పి వచ్చింది.
విచారణ జరిపి....
కడుపు నొప్పి తీవ్రం కావడంతో విద్యార్థులు వార్డెన్ కు ఫిర్యాదు చేశారు. కొందరు విద్యార్థులు వాంతులు కూడా చేసుకున్నారు. వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అదిస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం వెంటనే హెడ్ మాస్టర్ నరసింహులను సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కలుషిత ఆహారం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెబుతున్నారు.