Mohan Babu : తిరుమల లడ్డూ వివాదంపై మోహన్‌బాబు ఏమన్నారంటే?

తిరుమల లడ్డూ వివాదంపై సినీనటుడు మోహన్ బాబు రెస్పాండ్ అయ్యారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2024-09-21 12:58 GMT
mohan babu, cine actor, responded,  tirumala laddu controversy
  • whatsapp icon

తిరుమల లడ్డూ వివాదంపై సినీనటుడు మోహన్ బాబు రెస్పాండ్ అయ్యారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా మోహన్ బాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తిరుమల లడ్డూలో జంతువుల నూనె కలిపి ఘోర అపచారం జరిగిందని మోహన్ బాబు అన్నారు. అంతటి నీచానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు కోరారు.

కల్తీ జరిగిందని తెలిసి...
తాను శ్రీవారి భక్తుడినని, తిరుమల లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసి తాను చింతించానని మోహన్ బాబు తెలిపారు. మూడు నెలల వరకూ నెయ్యిలో జంతువుల నూనెను కలుపుతున్నారని తెలిసి తాను తల్లడిల్లిపోయానని తెలిపారు. తనతో పాటు తన విద్యాలయానికి చెందిన వేలాది మంది విద్యార్థులు సందర్శించుకునే తిరుమలలో ఇంతటి ఘోరం జరిగడం అత్యంత విచారకరమని తెలిపారు.


Tags:    

Similar News