ఏపీ లో వ్యవసాయ బడ్జెట్
వ్యవసాయ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఈ బడ్జెట్ ను సభ ముందుంచారు.
వ్యవసాయ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఈ బడ్జెట్ ను సభ ముందుంచారు. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ లో 11,387.69 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రధానంగా సహకార రంగం అభివృద్ధికి 248 కోట్లు కేటాయించారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం రంగం అభివృద్ధికి రూ.200 కోట్లు, మార్కెట్ యార్డుల్లో నాడు - నేడు పనులు చేపట్టడానికి 164 కోట్లు కేటాయించారు. వైఎస్సార్ జలకళ పథకానికి యాభై కోట్లు కేటాయించారు.
వివిధ శాఖల్లో....
సమగ్ర వ్యవసాయ రంగానికి 20 కోట్లు, రైతుల ఎక్స్ గ్రేషియో చెల్లింపుల కోసం 20 కోట్ల నిధులను కేటాయించారు. ఉద్యానవన శాఖ కు 554 కోట్లు, పట్టు పరిశ్రమ శాఖకు 98.99 కోట్లు కేటాయింపులు జరిపామని మంత్రి కన్న బాబు తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సటీకి 421 కోట్లు, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 59 కోట్లు, మత్స్య శాఖకు 337 కోట్లు, పశు సంవర్థక శాఖకు 1,027 కేటాయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకానికి 7,820 కోట్లు కేటాయించామని చెప్పారు.
ధాన్యం సేకరణకు...
ఏ సీజన్ లో పంట నష్టపోతే ఆ సీజన్ లోనే పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్ తమను ఆదేశించారని చెప్పారు. పంటల దిగుబడి పెరిగిందని చెప్పారు. ధాన్యం సేకరణకు నూతన విధానాన్ని ఈ ఏడాది నుంచి తమ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. రైతు భరోసా కేంద్రానికి వెళ్లి రైతు తన పంట వివరాలను నమోదు చేయించుకుంటే వారి పొలాల వద్దకు వెళ్లి పంట కొనుగోలు చేేస్తామని చెప్పారు. పెట్టుబడుల వ్యయాన్ని తగ్గించి మద్దతు ధర కల్పించేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని కన్నబాబు తెలిపారు.