లోక్ సభతో పాటుగా ఏపీ ఎన్నికలు ?

అసెంబ్లీలు, లోక్‌సభకు కలిపి 2023 డిసెంబరు నుంచి వచ్చే డిసెంబరు మధ్యలో ఎన్నికలు జరగాల్సిన 10 నుంచి 12 రాష్ట్రాల పాక్షిక జమిలి ఎన్నికలు జరిపే విధంగా కేంద్రం పావులు కదుపుతున్నట్లు సమాచారం.

Update: 2023-09-03 08:43 GMT

లోక్ సభతో పాటుగా ఏపీ ఎన్నికలు ?

అసెంబ్లీలు, లోక్‌సభకు కలిపి 2023 డిసెంబరు నుంచి వచ్చే డిసెంబరు మధ్యలో ఎన్నికలు జరగాల్సిన 10 నుంచి 12 రాష్ట్రాల పాక్షిక జమిలి ఎన్నికలు జరిపే విధంగా కేంద్రం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది నవంబరు-డిసెంబరులో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్‌, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉండగా, వచ్చే ఏడాది మే- డిసెంబరు మధ్య ఆంధ్రపదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిసా, సిక్కిం, హరియాణ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.

వచ్చే ఏడాది మే-డిసెంబరు మధ్య ఎన్నికలు జరపాల్సిన అసెంబ్లీలకు ముందస్తుకు సంబంధించి పెద్దగా ఇబ్బందులుండవని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల ముందు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ, ఈ ఏడాది నవంబరు- డిసెంబరుల్లో ఎన్నికలు జరగాల్సిన అసెంబ్లీలకు సంబంధించి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఏపీలోనూ డిసెంబర్ - జనవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సీఎం జగన్ ఒంటరి పోరుకు సిద్దం కావటంతో తాము ఎన్నికలు వచ్చినా రెడీగా ఉన్నామని వైసీపీ చెబుతోంది. అటు టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా, ఇంకా బీజేపీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో పార్లమెంట్ లో కేంద్రం తీసుకొచ్చే ప్రతిష్ఠాత్మక బిల్లుల ఆమోదంలో వైసీపీ పాత్ర కీలకం కానుంది. దీంతో, అటు వైసీపీని కాదని ఇప్పటికిప్పుడు పొత్తుల కోసం టీడీపీతో బీజేపీ చేతులు కలుపుతుందా అనేది సందేహమే. ఈ సమయంలోనే పొత్తుల్లో సీట్ల సర్దుబాటు మరో ప్రధాన అంశం. దీంతొ, మందస్తుగానే ఎన్నికలు వస్తే ఏపీలో మొత్తం రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News