మహాపాదయాత్ర కొనసాగుతుంది

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను ప్రభుత్వం వెనక్కు తీసుకున్నా అమరావతి రైతులు తమ పాదయాత్రను కొనసాగిస్తున్నారు;

Update: 2021-11-23 02:47 GMT

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను ప్రభుత్వం వెనక్కు తీసుకున్నా అమరావతి రైతులు తమ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. నేటికి 23వ రోజుకు రైతుల మహాపాదయాత్ర చేరుకుంది. నవంబరు 1వ తేదీన తుళ్లూరులో ప్రారంభమైన మహా పాదయాత్ర తిరుపతిలో ముగియనుంది. అమరావతిలోనే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు మహాపాదయాత్ర చేపట్టారు.

నెల్లూరు జిల్లాలో...
వీరు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నారు. ప్రభుత్వం చట్టాలను వెనక్కు తీసుకున్నా నమ్మకంలేదని, మరో బిల్లు పెడతామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడంతో పాదయాత్రను కొనసాగిస్తున్నామని రైతులు చెబుతున్నారు. మహాపాదయాత్రకు అన్ని పార్టీలూ సంఘీభావం ప్రకటించాయి. డిసెంబరు 15వ తేదీన ఈ యాత్ర తిరుమలకు చేరకుని ముగియనుంది.


Tags:    

Similar News