TDP : నేను టీడీపీకి మద్దతివ్వను.. తెగేసి చెప్పిన మాజీ ఎమ్మెల్యే

అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు

Update: 2024-03-28 06:39 GMT

అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. తాను టీడీపీకి మద్దతివ్వనని, బీజేపీకి ఓటు వేయమని చెప్పనని ఆయన తెలిపారు. అనపర్తి నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. నిన్న ఆ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి థిక్కార స్వరం వినిపించారు. తనను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని ఆయన మండిపడ్డారు. అనపర్తిలో బలం లేని బీజేపీకి ఎలా సీటు కేటాయిస్తారంటూ ఆయన ప్రశ్నించారు. తాను బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చేది లేదని తెగేసి చెప్పారు. తనకు టిక్కెట్ రాకుండా వైసీపీ అడ్డుకుందని ఆయన ఆరోపించారు. 

రెబల్ అభ్యర్థిగా...
తూర్పు గోదావరి జిల్లా రామవరంలో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల నిరసనకు దిగారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ కరపత్రాలు దగ్ధం, సైకిల్ ను మంటలో వేసి నిరసన తెలియజేశారు. తన నివాసంలో అనుచరులతో నల్లమిల్లి సమావేశమయ్యారు. కాసేపట్లో నిర్ణయం ప్రకటించనున్నారు. అనపర్తి నుంచి రెబల్ గా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకే తన భవిష‌్యత్ కార్యాచారణ ఉంటుందని ఆయన అన్నారు. 


Tags:    

Similar News