పదోతరగతి పరీక్ష ఫలితాల విడుదల.. ఉత్తీర్ణత శాతం ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి 6.23 లక్షల మంది పదోతరగతి పరీక్షలు రాశారు

Update: 2024-04-22 05:51 GMT

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి 6.23 లక్షల మంది పదోతరగతి పరీక్షలు రాశారు. విద్యాశాఖ కమిషనర్ ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యాసంవత్సరం ముగియకముందే ఫలితాలను ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేపర్లను దిద్దే ప్రక్రియ ఈసారి రికార్డు స్థాయిలో వేగంగా చేశామని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.

పార్వతీపురం మన్యం జిల్లా...
ఈసారి 86.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా 96.37 శాతం మంది ఉత్తీర్ణులయి ప్రధమ స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా ఉత్తీర్ణత నమోదయినట్లు విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకూ నిర్వహించారు. వెంటనే మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించారు.


Tags:    

Similar News