Chandrababu : ఆ కుటుంబానికి చంద్రబాబు నేరుగా ఫోన్

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు;

Update: 2024-10-23 06:40 GMT

belt shops in ap

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కడప జిల్లా బద్వేల్ లో ప్రేమికుడి దాడిలో గాయపడి మరణించిన యువతి కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు. తక్షణం పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందచేస్తున్నట్లు ప్రకటించారు.

పది లక్షల ఆర్థిక సాయం...
జిల్లా కలెక్టర్ తో పాటు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి పది లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందచేశారు. పెట్రోలు దాడి చేయడంతో కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ యువతి మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యువతి తల్లితో కూడా చంద్రబాబు మాట్లాడారు. తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. యువతి తల్లికి ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.


Tags:    

Similar News