Chandrababu : వరద బాధితులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు

వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2024-09-06 14:12 GMT

వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. వరద బాధితులకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. బుడమేరుకు పడిన గండ్లు యుద్ధప్రాతిపదికన పూడ్చేందుకు పనులు చేస్తున్నామని తెలిపారు. మొత్తం మూడు గండ్లు పడితే అందులో రెండు గండ్లు పూడ్చగలిగామని, మరో ఒక గండిని ఆర్మీసాయంతో పూడ్చేందుకు రేయింబవళ్లూ పనిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 76. 2 శాతం పారిశుద్ధ్య పనులు పూర్తయ్యాయని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా చెప్పారు. మెడికల్ క్యాంప్‌లు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఆహార పదార్థాలలో నాణ్యత బాగుందని ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. 3,12,303 ఫుడ్ పాకెట్లను పంపిణీ చేశామని తెలిపారు. 11 లక్షల యాభై నాలుగువేల వాటర్ బాటిల్స్, 4 లక్షల మిల్క్ ప్యాకెట్లను పంపిణీ చేశామని చంద్రబాబు తెలిపారు.

అందరికీ ఉపాధి... వస్తువులన్నీ రిపేర్ చేయిస్తాం...
తాగునీటి కోసం 250 ట్యాంకర్లు పనిచేస్తాయని తెలిపారు. కార్పొరేషన్ వాటర్ వదులుతున్నామని, అయితే ఆ నీటిని తాగడానికి కాకుండా కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఉపయోగించుకోవాలని తెలిపారు. 7,500 మంది పారిశుద్ధ్య కార్మికులు రేయింబవళ్లూ పనిచేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఫైర్ ఇంజిన్లతో మట్టిని తొలగిస్తున్నారని తెలిపారు. ఇళ్లలో ఉండే మట్టిని తొలగిస్తున్నామని తెలిపారు. రోడ్లను కూడా శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నామని తెలిపారు. వరదకు గురైన ప్రాంతాల్లో కొన్నిచోట్ల విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించామని తెలిపారు.
రెండు రూపాయలకే కూరగాయలు....
అనేక వాహనాలు చెడిపోయాయని, వాటికి మెకానిక్ లు అవసరమని అన్నారు. అర్బన్ కంపెనీ సాయంతో ఇళ్లలో వస్తువులను రిపేర్ చేయించడానికి ప్రయత్నించానని తెలిపారు. ధరలు తగ్గించి వారు తీసుకుంటారని చంద్రబాబు తెలిపారు. అందరి ఇళ్లలో పాడైపోయిన వస్తువులన్నీ బాగు చేయించే బాధ్యతను తీసుకుంటామని తెలిపారు. వరద బాధితులందరికీ ఉపాధి కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కూరగాయలను రెండు, ఐదు, పది రూపాయలకే విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బట్టలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. సాయం అందించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News