Narendra Modi : భారత యుద్ధనౌకలను ప్రారంభించిన మోదీ
రక్షణ రంగంలో మేకిన్ ఇండియా ఆవిష్కృతమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు;
రక్షణ రంగంలో మేకిన్ ఇండియా ఆవిష్కృతమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముంబయిలో యుద్ధనౌకలను ఆయన ప్రారంభించిన అనంతరం ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. ప్రపంచంలోనే భారత్ బలమైన శక్తిగా మారుతుందని మోదీ అన్నారు. ఈ యుద్ధనౌకలు భారత నౌకాదళానికి మరింత బలాన్ని అందిస్తాయని నరేంద్ర మోదీ ఆకాక్షించారు.
దేశీయ విధానంలో...
దేశీయ విధానంలో యుద్ధనౌకల తయారీ గర్వకారణమన్న మోదీ రక్షణ రంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. భారత్ లో ఏ రంగానికి ఇవ్వని విధంగా ప్రాధాన్యత రక్షణ రంగానికి ఇస్తుందని చెప్పారు. భారత్ సరిహద్దులను కాపాడుకోవడమే కాకుండా శాంతియుత పరిస్థితులను నెలకొల్పడంలో రక్షణ రంగం చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మరింత ముందుకు వెళ్లి భారత్ ను రక్షణ కల్పించడంలో కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.