Ys Jagan : లండన్ వెళ్లిన జగన్ .. తిరిగి నెలాఖరుకు ఏపీకి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న సతీమణి భార్యతో కలసి లండన్ కు బయలుదేరి వెళ్లారు;

Update: 2025-01-15 04:20 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న సతీమణి భార్యతో కలసి లండన్ కు బయలుదేరి వెళ్లారు. యూకేలో జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి ఫైనాన్స్ లో ఎంఎస్ పూర్తి చేసి నేడు పట్టా అందుకోనుంది. ఈ కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరవుతున్నారు. సీబీఐ కోర్టు అనుమతితో జగన్ కుటుంబంతో కలసి లండన్ కు బయలుదేరి వెళ్లారు.

ఈ నెలాఖరుకు వచ్చి...
తిరిగి ఆయన ఈ నెలాఖరుకు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. వచ్చిన తర్వాత ఆయన రాష్ట్ర స్థాయి పర్యటనపై క్లారిటీ రానుంది. ఎప్పటి నుంచి ఏ జిల్లా నుంచి ఆయన జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తారన్నది తెలియనుంది. జనవరి మూడో వారంలో జిల్లా పర్యటనలు చేస్తారని జగన్ పర్యటించిన నేపథ్యంలో ఈ నెలలో ఆయన పర్యటన ఉండే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.


Tags:    

Similar News