Chandrababu : మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు.. వారి ఖాతాలో ఇరవై వేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం అమలుపై క్లారిటీ ఇచ్చారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం అమలుపై క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
రైతుల ప్రయోజనాల కోసమే...
రైతుల ప్రయోజనాల కోసమే తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కేవలం పెట్టుబడి సాయం మాత్రమే కాకుండా రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు కూడా త్వరలో ఇస్తామని తెలిపారు.