లోకేష్ - మోదీ మధ్య ప్రత్యేక సంభాషణ ఏంటంటే?

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా విశాఖలో ఆసక్తికరమైన ఘటన జరిగింది;

Update: 2025-01-09 02:51 GMT

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా విశాఖలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. సభప్రాంగణంలోకి వస్తున్న సందర్భంగా వేదికపైకి వెళ్లే ముందు గ్రీన్ రూంలో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులను వరసగా కలుస్తూ పరిచయం చేసుకున్నారు. అందులో లోకేష్ వద్దకు వచ్చిన వెంటనే మోదీ ఆగడంతో లోకేశ్ నమస్క రించగానే ‘నీ మీద ఒక ఫిర్యాదు ఉంది' అంటూ మోదీ అన్నారు.

తనను వచ్చి కలవాలంటూ...
లోకేష్ పై ఫిర్యాదు ఏంటో మీకూ తెలుసు అని పక్కన ఉన్న చంద్రబాబుతో అన్నారు. తర్వాత 'ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది. దిల్లీ వచ్చి నన్ను ఎందుకు కలవలేదు? కుటుంబంతో వచ్చి నన్ను కలువు' అంటూ లోకేశ్ భుజం తట్టారు. ఆరు నెలలైనా దిల్లీ వచ్చి నన్ను ఎందుకు కలవలేదు అని ప్రశ్నించారు. దీనికి లోకేశ్ స్పందిస్తూ 'త్వరలోనే వచ్చి కలుస్తా సార్' అని అన్నారు.


Tags:    

Similar News