Chandababu : తిరుపతి ఘటనపై చంద్రబాబు ఆగ్రహం
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు;
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి ఎందుకు ఏర్పాట్లు చేయలేదని చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదా? అని చంద్రబాబు అధికారుపై మండిపడ్డారు.
అధిక సంఖ్యలో వస్తారని తెలిసి...
భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిసి నామమాత్రపు చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జరిగిన ఘటన తనను కలసి వేసిందన్న ఆయన గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. టోకెన్లు ఇచ్చే కౌంటర్ల వద్ద భద్రతను పెంచడమే కాకుండా అవసరమైన ముందస్తు చర్యలను తీసుకోవాలని సూచించారు.