Chandrababu : చంద్రబాబు కీలక నిర్ణయం.. మంత్రులకు ఇక?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి వర్గ సమావేశాలు ఇకపై నెలకు రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించారు. నెలలో రెండు సార్లు కేబినెట్ భేటీ కావాలని నిర్ణయించారు. ప్రతి నెల మొదటి, మూడో గురువారం ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరిగేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈనెల 19వ తేదీన....
ఈ నెల 3వ తేదీన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరిగి ఈ నెల 19వ తేదీన మంత్రివర్గ సమావేశం మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు సమాచారం. నెలకు రెండు సార్లు మంత్రివర్గం సమావేశమయితే మంత్రుల్లో జవాబుదారీతనం పెరగడమే కాకుండా వారి శాఖలపై పట్టును పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని చంద్రబాబు అంచనా వేశారు.