Breaking : ఏపీ వాసులకు గాంధీజయంతి రోజు శుభవార్త చెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గాంధీ జయంతి రోజున ఆయన ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. గాంధీ జయంతి రోజున ఆయన ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి చెత్తపన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నేటి నుంచి ఎక్కడా చెత్త పన్నును రద్దు చేయవద్దంటూ ముఖ్యంగా మున్సిపల్ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఈరోజే చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
చెత్త పన్ను పేరుతో...
గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో అన్ని మున్సిపాలిటీల్లో చెత్త పన్ను వసూలు చేసేది. ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించాలంటే చెత్తపన్నును చెల్లించాల్సిందేనంటూ షరతు విధించడంతో దాదాపు నాలుగేళ్ల పాటు ఏపీ ప్రజలుచెత్త పన్నును చెల్లించారు. అయితే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసే ప్ర్రక్రియలో భాగంగా గాంధీ జయంతి రోజు నుంచి చెత్త పన్నును రద్దు చేయాలని నిర్ణయించడంతో కోట్లాది మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.