Andhra Pradesh : చంద్రబాబు వారికి గుడ్ న్యూస్.. ఇరవై వేలు బ్యాంక్ ఖాతాలో ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ఇరవై వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది;

Update: 2025-01-03 05:55 GMT

AP CM Visit Kadapa district

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ఇరవై వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మత్స్యకారులకు ఇరవై వేలు అందచేసేందుకు సిద్ధమయింది. ఇందుకు అర్హులైన వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అందుకు అవసరమైన నిధులను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

ఉపాధి లేక అవస్థలు పడుతున్న...
తరచూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫలితంగా చేపల వేటకు వెళ్లకుండా మత్స్యకారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వరస అల్పపీడనాలతో ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు పది వేల రూపాయల ఆర్థిక సాయం అందించింది. అయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే ఏప్రిల్ నెలలో ఎంపిక చేసిన మత్స్యకారుల ఖాతాల్లో ఇరవై వేల రూపాయల నగదును ప్రభుత్వం జమ చేయనుంది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News