Andhra Pradesh : పెన్షనర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది;

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో పింఛన్ల పంపిణీలో వేలిముద్రల నమోదు కష్టాలకు ఇక తెరపడనుంది.ఏపీలో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు పడక లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఏప్రిల్ నుంచి కొత్తగా వేలిముద్రల నమోదు స్కానర్లను అందుబాటు లోకి తీసుకురానుంది.
వేలిముద్రలు పడకపోయినా...
ప్రస్తుతం ఎల్-0 స్కానర్ల ద్వారా లబ్ధిదారుల వేలిముద్రలు వేయిస్తుండగా.. వాటి స్థానంలో ఎల్-1 స్కానర్లను తీసుకొచ్చారు. ఆధార్ సాఫ్ట్ వేర్ యూఐడీఏఐ ఆధునికీకరించడంతో పాత పరికరాలు ఉపయోగపడే అవకాశం లేదని సదరు సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ విధానంతో వేలి ముద్రలు పడకపోయినా అర్హులను గుర్తించే వీలుంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.