చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేది ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు

Update: 2024-08-25 02:15 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. దసరా సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తేదీలు నిర్ణయించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4వ తేదీ నుంచి ప్రారంభమై పన్నెండవ తేదీ వరకూ జరుగుతాయి. అక్టోబరు 8వ తేదీన భక్తులు ప్రముఖంగా భావించే గరుడ వాహనసేవ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్షించారు.

సాలకట్ల బ్రహ్మోత్సవాలను...
సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ నిర్వహించాలని నిర్ణయించారు. రాత్రి ఏడు గంటల వరకూ వాహన సేవలుంటాయి. మాడవీధుల్లో శ్రీవారు విహరిస్తారు. అయతే అక్టోబరు 4వ తేదీన శ్రీవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు కాబట్టి వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. సిఫార్సు లేఖలు కూడా అనుమతించరు. గదుల కేటాయింపు కూడా రద్దు చేసినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.


Tags:    

Similar News