Chandrababu : తిరుపతికి చేరుకోనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో తిరుపతికి చేరుకోనున్నారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో తిరుపతికి చేరుకోనున్నారు. నిన్న జరిగిన ఘటనపై ఆయన అధికారులతో సమీక్ష చేయనున్నారు. స్విమ్స్, రుయా ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. వారికి అందుతున్న వైద్య సేవలను గురించి చంద్రబాబు ఆరా తీస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
మంత్రులకు ఆదేశం...
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన నేపథ్యంలో ముగ్గురు మంత్రులను తిరుపతికి వెంటనే వెళ్లి అక్కడ పరిస్థితులను సమీక్షించాలని చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లు తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నారు. తిరుపతి పర్యటనలో మృతుల కుటుంబాలకు చంద్రబాబు ఎక్స్ గ్రేషియో ప్రకటించే అవకాశాలున్నాయి.