Chandrababu : నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు.

Update: 2024-09-21 04:27 GMT
chandrababu naidu, chief minister, central office, andhra pradesh, andhra pradesh chief minister chandrababu naidu will visit telugu desam party central office today, tdp latest news today, ap political, CBN news updates today, Ap latest news

chandrababu naidu

  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ చంద్రబాబు పార్టీ కార్యాలయంలోనే ఉండి కార్యకర్తల నుంచి వినతులను స్వీకరిస్తారు.

కార్యకర్తల నుంచి...
ప్రతి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తానని చెప్పిన నేపథ్యంలో ఆయన ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నేతలతో కూడా సమావేశం కానున్నారు. జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నారు. ప్రతి రోజూ కార్యకర్తల నుంచి వినతులను స్వీకరించడానికి పలువురు నేతలను ఇప్పటికే అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News