Chandrababu : రేపు పోలవరానికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.
అధికారులతో సమీక్ష...
రేపు ఉదయం 11 గంటలకు హిల్ వ్యూకు చేరుకోనున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు వద్ద ఉను్న డయాఫ్రంవాల్, కాపర్ డ్యామ్ పనులు పరిశీలించనున్నారు. నంతరం పోలవరం ప్రాజెక్ట్ పనులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడే అవకాశముంది. అదే సమయంలో చంద్రబాబు పోలవరం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.